రేణిగుంట:
"రాజకీయాల్లో విజయం అంటే కేవలం ఒక వ్యక్తి గెలవడం కాదు.. అది వేలాది మంది ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతిరూపం.. అలాగే ఆ భగవంతుడు అందించిన ఆశీస్సుల బలం" అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజల నిరంతర ఆదరణ, దైవానుగ్రహం వల్లే సుధీర్ రెడ్డి ఎన్నికల్లో 43 వేల ఓట్ల భారీ మెజారిటీతో తిరుగులేని, చారిత్రాత్మక విజయాన్ని సాధించారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు.. శనివారం ఉదయం శ్రీకాళహస్తి రూరల్ మండలం ఊరందూరు గ్రామం నుండి తిరుమల వెంకన్న సన్నిధికి ఆమె కాలినడకన పాదయాత్రను అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ యాత్రకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, ‘గోవింద నామ’ స్మరణతో భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు. వెంకటాపురం వద్ద వెల్లువలా వచ్చిన అభిమానం.ఊరందూరు నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర రేణిగుంట పరిధిలోని వెంకటాపురం వద్దకు చేరుకోగా, స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళలు, అభిమానులు రిషితా రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. అన్నాస్వామిపల్లి గ్రామ కమిటీ టీడీపీ సీనియర్ నాయకులు కాపిరెడ్డి నాదముని రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు గజమాలలతో ఘన స్వాగతం పలికి, పూలవర్షం కురిపించారు. ‘జై తెలుగుదేశం’ నినాదాలు, భక్తి గీతాల ఆలపనతో యాత్ర మార్గమంతా ఆధ్యాత్మిక, రాజకీయ శోభ సంతరించుకుంది.ఈ సందర్భంగా రిషితా రెడ్డి మాట్లాడుతూ... పార్టీ కార్యకర్తల అహర్నిశల కష్టం, ప్రజల గుండెల్లో బొజ్జల కుటుంబానికి ఉన్న ఆదరణ వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో మరింత ప్రగతి పథంలో దూసుకుపోవాలని తాను శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. పాదయాత్రలోనే నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఇదే తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు కావడంతో, పాదయాత్ర మార్గంలోనే ఆమె జన్మదిన వేడుకలను పండుగలా నిర్వహించారు. స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిషితా రెడ్డి కేక్ కట్ చేసి, భువనేశ్వరి కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.ఆధ్యాత్మికత, రాజకీయ చైతన్యం కలగలిసిన ఈ భారీ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కాపిరెడ్డి నాదముని రెడ్డితో పాటు విభిన్న అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు మరియు బొజ్జల అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో


