
బి ఎల్ ఓ లకు కీలక ఆదేశాలుచెరుకూరి నవీన్...అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదు,, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్..
కొండాపురం జూన్ 20, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) సర్వేపై BLOలతో ప్రత్యేక సమావేశం శనివారం స్థానిక కొమ్ము సచివాలయ కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరు నవీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నిర్వహణలో పాటించాల్సిన విధి విధానాలు, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలపై BLOలకు సచివాలయం లో వివరంగా అవగాహన కల్పించారు.సర్వే ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అత్యంత జాగ్రత్తతో పని చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవ సమాచారాన్ని నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసుకుని పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో ఉన్న తప్పొప్పుల సవరణ, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని BLOలకు సూచనలు జారీ చేశారు.ఓటరు జాబితా స్వచ్ఛంగా, ఖచ్చితంగా ఉండేలా ప్రతి BLO, లు అందరూ బాధ్యతయతం గా వ్యవహరించాలని అధికారులు ను పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా వెన్నెముక వంటిదని, అందువల్ల సర్వే పనులను నిబద్ధతతో పూర్తి చేసి ఎన్నికల సంఘం లక్ష్యాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూతు లెవల్ ఆఫీసర్లు మరియు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
