మన న్యూస్తి:తిరుపతి డిసెంబర్ 18:దేశ భవిష్యత్తుకు ఎన్.సి.సి ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో ఆర్ అండ్ వీ రేజ్మెంట్ ఎన్ సీసీ తిరుపతి లెఫ్ట్నెంట్ కల్నల్ అనుప్ ఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హై స్కూల్ చదువుతోపాటు జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా ఎన్ సీసీ లో చేరి యువత బంగారు భవిష్యత్తుకు పునాది కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలతో పాటు ఎన్సిసి సర్టిఫికెట్లతో ఉద్యోగ అవకాశాలతో పాటు మంచి మెరుగైన విద్య అవకాశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయన్నారు. చిన్నప్పటినుండి ఎన్సీసీని అలవర్చుకోవడం వల్ల క్రమశిక్షణతో పాటు వారి మేధాశక్తి కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాను కూడా చదివే రోజుల్లో ఎన్సిసి విద్యార్థినేనని గుర్తు చేశారు.ఆకట్టుకున్న గుర్రపు స్వారీలు.ఎన్సిసి విద్యార్థులు పలువురు గుర్రాలతో పలు స్వారీలు నిర్వహించి అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నారు. విన్యాసాలు ప్రదర్శించిన ఎన్సిసి విద్యార్థులను మంత్రి అభినందించారు.అలాగే 75 మంది ఎన్సిసి విద్యార్థులు రక్తదానం కూడా చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కల్నల్ శతేందర్ దహియా,జిపి సిడిఆర్ ఎన్సిసి వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమణ,ఆర్మీ ఉద్యోగులు,ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.