
బిఎస్ఎన్ఎల్ పై ప్రజల్లో ఆదరణ..వార్షిక ఆదాయం లాభాల బాటలో..రోజురోజుకీ పెరుగుతున్న వినియోగదారులు..నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి...
ఉదయగిరి జూన్ 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
నెల్లూరులోని ప్రధాన బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన 3వ టెలికం అడ్వైజరీ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కమిటీ చైర్మన్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సభ్యులు తాటికొండ అనూష తదితరులు. ఈ సందర్భంగా జిల్లాలో అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి పై స్థానిక టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ తాటికొండ అనూష చర్చించారు. అనంతరం టెలికం అధికారులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ను అడ్వైజరీ కమిటీ మెంబర్ తాడికొండ అనూషను శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు తాటికొండ అనూష మాట్లాడుతూ గత ఏడాది బిఎస్ఎన్ఎల్ వార్షిక ఆదాయం తో పోల్చుకుంటే ఏడాది అదనంగా బిఎస్ఎన్ఎల్ కు కోటి రూపాయలు ఆదాయం వచ్చిందని అన్నారు. అలాగే జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటుకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని భవిష్యత్తులో మరింతగా ప్రజలకు బిఎస్ఎన్ఎల్ చేరువయ్యే విధంగా కృషి చేస్తామని అందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని తెలిపారు. అనంతరం టెలికం అడ్వైజరీ మెంబర్ అనూష మాట్లాడుతూ ఈ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గానికి ఇప్పటివరకు 34 మొబైల్ టవర్లు మంజూరు అయ్యాయని వాటిని ఏర్పాటు చేయుటకు అవసరమైనటువంటి భూమిని కూడా రెవెన్యూ అధికారుల ద్వారా సేకరించడం జరిగిందని తెలియజేశారు.నియోజకవర్గంలో 34 బిఎస్ఎన్ఎల్ టవర్లు పనులు ప్రారంభించడం త్వరలోనే జరుగుతుందని తెలిపారు. ఈ బిఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరుకు సహాయ సహకారాలు అందించిన శాసనసభ్యులు కాకర్ల సురేష్ కు అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉదయగిరి నియోజకవర్గంలో బిఎస్ఎన్ఎల్ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల టెలికాం అడ్వైజరి సభ్యులు, టెలికాం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
