రేణిగుంట:
రేణిగుంట పట్టణం పరిధిలోని కరకంబాడి నందు అత్యంత వైభవంగా జరుగుతున్న గంగమ్మ జాతర మహోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు, జాతర కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన కరకంబాడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆలయానికి వెళ్లి గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం కోలా ఆనంద్ మాట్లాడుతూ... గంగమ్మ అమ్మవారిని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లవేళలా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు మరియు జాతర కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


