
దుత్తలూరు, జూన్ 11, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం టౌన్ లోని మినీ పంక్షన్ హాలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 డేస్ గో టు విలేజ్ కార్యక్రమం విజయవంతానికై ఉదయగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్-ఎంఎస్పీ నెల్లూరు జిల్లా ఇన్చార్జీ మంద వెంకటేశ్వరరావు మాదిగ,
ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ,ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగలు పాల్గొని.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణలు జరగాలని,ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎమ్మార్పీఎస్ జెండాలు ఏర్పాటు చేయాలనీ.అలాగే యువత చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని,విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు పూర్తిస్థాయిలో అందుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.మాదిగలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని,గ్రామ స్థాయిలో ఎంఆర్పీఎస్-ఎంఎస్పీ కమిటీలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మంద సుజాత మాదిగ ,గ్రామ కమిటీ సభ్యులు,మాదిగ పెద్దలు,మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్, ఎమ్ ఎస్ పి, ఎమ్ ఈ ఎఫ్,నాయకులు గొల్లపల్లి మోహన్ రావు,వడ్లపల్లి కృష్ణయ్య, గంగపట్ల సింహాద్రి, గోసాల కొండలరావు, ఇలారి దేవదాస్,గోసాల సుధాకర్, బర్రె అర్జున్, మొలబంటి సుధాకర్, గంగపట్ల నాగరాజు, గొల్లపల్లి వెంగల్ రాయుడు, గున్న వివేక్ గంగపట్ల వెంగల్ రావు కొసినపోగు విజయ్,కొమ్ము పెంచలరావు,గంగపట్ల రవీంద్ర, తాళ్లూరి దేవదాస్, గొల్లపల్లి చిన్న పెంచలయ్య కండె గిరి నాగేంద్ర, అంకి వెంకటేష్, అమ్మునబ్రోలు నాగేష్, అంకి సామెలు, బక్క పేతురు తదితరులు పాల్గొన్నారు.
