శ్రీకాళహస్తి జూన్ 11.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద రేపు 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ విజయోత్సవ సభను విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో గత రెండేళ్లుగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ ప్రతిష్టాత్మక సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సభకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మరియు కూటమి అగ్రనేతలు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను చాటిచెప్పే ఈ మహాసభకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కోరారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు మరింత బలపడేలా ఈ విజయోత్సవ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తేదీ: 12-06-2026
వేదిక: దామినేడు, తిరుపతి సమీపంలో
"రెండేళ్ల సంక్షేమ - అభివృద్ధి పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ మహాసభను శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయండి" అని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు..
