ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం
తిరుపతి, జూన్ 05: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడే అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ జిల్లా మూలపాడు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి కాపీలతీర్థం సమీపం లోని నగరవనంలో అధికారులు, విద్యార్థులు, వాకర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ పవన్ కుమార్, ఎఫ్ ఆర్ ఓ లు సుదర్శన్ రెడ్డి, మాధవి, దాదాపు 100 మంది విద్యార్థులు, ఏపీ గ్రీన్ క్రాప్స్, గోపాల్స్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు మరియు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు, విద్యార్థులు, వాకర్స్ పర్యావరణ పరిరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించడంతో పాటు విద్యార్థులు, సిబ్బంది, తదితరులు సీడ్ బాల్స్ తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు, యువత పాత్ర పై విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి ముచ్చటించారు.
ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జీవ వైద్యాన్ని, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమం నేపథ్యంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ, వితరణ చేపట్టాలని సూచించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని అందులో తిరుపతి జిల్లాలో 32.50 సీడ్ బాల్స్ లక్ష్యం నిర్దేశించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అటవీ శాఖ పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ భారీ సీడ్ బాల్ కార్యక్రమం రాష్ట్రంలోని హరితావరణాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

