మన న్యూస్:పాచిపెంట, డిసెంబర్ 18 పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోతుపాన్ కారణంగా రెండు రోజులపాటు వర్షం పడే అవకాశాలు ఉన్నందున రైతుల అప్రమత్తంగా ఉండాలని వరి కోతలు వాయిదా వేసుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు కోరారు. మండలం చెరుకుపల్లి,అమ్మ వలస గ్రామాలలో వరి నూర్పులను పరిశీలించి రైతులకు రెండు రోజులు పాటు కురిసే వర్షాలకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు జారీ చేశారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలని కోతలు కోసినవి కుప్పలు వేసి కప్పుకోవాలని తెలిపారు.గ్రామ వ్యవసాయ సహాయకులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని రానున్న వర్షాలపై రైతులకు తెలియజేయాలని సూచించారు.వరి కోసిన ధాన్యం రోడ్లపై ఉండకూడదని అత్యవసర పరిస్థితులలో జాయింట్ కలెక్టర్ ద్వారా వచ్చిన 20 టార్పలిన్ లను వినియోగించుకోవాలని సూచించారు.ఎక్కడైనా ధాన్యం నిలవలు ఉన్నట్లయితే వెంటనే ట్రక్ షీట్లు చేసి మిల్లులకు పంపించాలని సూచించారు.మొక్కజొన్న పంటకు నీరు పోయేందుకు సదుపాయం కల్పించాలని రైతులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మోహన్ కృష్ణ పాల్గొన్నారు.