తిరుపతి (రేణిగుంట):
జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పవర్ రామచంద్రన్ జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, క్రైస్తవ మత పెద్దలు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రేణిగుంట మండలం ఎస్.ఏ.ఎల్.సి. బోధకులు రెవరెండ్ సతీష్ విజయ్ కుమార్ మరియు రేణిగుంట ఆర్.సి.ఎఫ్. అధ్యక్షులు శాంసన్ తో పాటు పాస్టర్ సతీష్ బాబు, పాస్టర్ శామ్యూల్, పాస్టర్ పాల్సన్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పవర్ రామచంద్రన్ కి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందజేశారు.
అదేవిధంగా, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపాక దాము అన్న, తిరుపతి మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు మరియు ఎస్.వీ. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ విచ్చేసి పవర్ రామచంద్రన్ ని దుశ్శాలువలతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పవర్ రామచంద్రన్ మాట్లాడుతూ, తన పుట్టినరోజున విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జై భీమ్ సేన నిరంతరము క్రైస్తవ సమాజానికి వెన్నంటే ఉంటుందని, వారి హక్కుల కోసం, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు జై భీమ్ సేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవర్ రామచంద్రన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

