రేణిగుంట జూన్ 3.
"సత్య నిరూపణే ధ్యేయంగా సాగుతున్న సాక్షి మీడియా రిపోర్టర్ మోహన్ నాయుడు అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఉత్తేజిత స్టాఫ్ రిపోర్టర్ రియాజ్ బృందం."....తిరుపతి జిల్లా (రెణిగుంట):
నిజం ఎప్పుడూ నిప్పులాంటిదే. దాన్ని కప్పిపుచ్చాలని చూసే శక్తులు ఎన్ని ఉన్నా, క్షణక్షణం శ్రమిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం ఆ నిజాన్ని వెలికితీసే నిఖార్సైన జర్నలిజానికి నిలువెత్తు రూపం సాక్షి మీడియా రిపోర్టర్ మోహన్ నాయుడు అన్న. వృత్తి పట్ల అంకితభావం, నిరంతర శ్రమ, సామాజిక స్పృహ కలగలిసిన ఆయన కలం ఎందరికో ఆదర్శం. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం…
🔹 నిజాయితీకి మారుపేరు… మోహన కలం.
సమాచార సేకరణ అనేది కేవలం ఒక వృత్తి కాదు, అదొక నిరంతర తపస్సు. ప్రతిక్షణం సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ, నిజా నిజాలను నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో మోహన్ నాయుడు అన్న శైలి ప్రత్యేకం. ఆయన కలం ద్వారా సేకరించే సమాచారం, ప్రచురించే వార్తలు నిక్కచ్చిగా, నిఖార్సుగా ఉంటాయి. అబద్ధాల ముసుగులను చీల్చుకుంటూ, నిజాయితీని నిలబెట్టే తపన ఆయన ప్రతి వార్తలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలో నిజాలను నిక్కచ్చిగా రాసే ఇటువంటి జర్నలిస్టుకు సాటి ఎవరూ లేరనడంలో ఎలాంటి సందేహం లేదునిప్పులాంటి నిజము నిలువెల్లా దాచుకొని క్షణక్షణము సమాచార శోధనసేయు వీరుడా!
లోకాన చీకట్లను చీల్చేటి వెలుగులా
కలము పట్టిన క్రాంతి వీరుడా, మోహన అన్నా!
భయము నెరుగని నీ కలపు పోటుకు
అబద్ధాల కోటలు బద్దలైపోవా?
నిక్కచ్చిగ నిజాలను నిఖార్సుగ పలికే
నీ అక్షర ప్రవాహానికి సాటి ఎవరున్నారురా?
🔹 తోటి జర్నలిస్టుల గుండెల్లో స్థానం…
వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత, తోటి జర్నలిస్టులకు ఇచ్చే ధైర్యం ఎనలేనివి. అందుకే ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఉత్తేజిత స్టాఫ్ రిపోర్టర్ రియాజ్, సబ్ ఎడిటర్ చందు మరియు మిత్ర బృందం అంతా కలిసి తమ అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటూ, అన్నకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆ కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మోహన్ నాయుడు అన్నపై ఎల్లవేళలా ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీ కలం మరింత పదునుదేరి, సమాజానికి మరిన్ని నిజాలను అందిస్తూ నిరంతరం విజయపథంలో సాగాలని ఆకాంక్షిస్తూ… మోహన్ నాయుడు అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
శుభాకాంక్షలు తెలుపువారు:
రియాజ్ (ఉత్తేజిత స్టాఫ్ రిపోర్టర్)
చందు (సబ్ ఎడిటర్)
మరియు ఉత్తేజిత స్టాఫ్ మిత్రులు.
