
కలిగిరి, జూన్ 03, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి నేషనల్ హైవేపై వరస ప్రమాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కావలి ఆర్డీవో ఎలీషా బాబు కలిగిరి తహసీల్దార్ కార్యాలయం నందు కీలక సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ హిమాన్సు శుక్లా సూచనలతో, రెవెన్యూ ,నేషనల్ హైవే ,ఆర్అండ్బి ,అధికారులతో కలిసి ఆర్డీవో ఎలీషా బాబు సమవేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గిరీష్ ఎంపీడీవో ప్రత్యూష తదితర అధికారులు పాల్గొన్నారు.