నెల్లూరు, మన న్యూస్ ,డిసెంబర్ 17 :- నెల్లూరు నగరంలో ప్రముఖ ఆలయాలను అభ్యర్థి చేయునట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు .పది రోజుల తర్వాత తాను మంత్రి నారాయణ ఇద్దరు నగరంలో తిరిగి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. నెల్లూరు రంగనాయకుల పేటలో మంగళవారం రాత్రి జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ నూతన భవనంలో శిలాఫలకాలను మంత్రులు ఫరూక్, నారాయణ కలిసి ఆనం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.... నెల్లూరులో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ఘాటు పూర్తిచేయటం పాటు ,ములాపేట వేణుగోపాలస్వామి ఆలయాన్ని పునః నిర్మించున్నట్లు తెలిపారు. నగరం ,పట్టణాల్లో ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకొని దేవస్థానం నిధులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయునట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ ,జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, తాళ్లపాక అనురాధ ,రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ప్రాంతీయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ,ఉప కమిషనర్ కె.బి శ్రీనివాసులు ,జిల్లా సహాయ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, వివిధ ఆలయాల కార్యనిర్వణాధికారులు పాల్గొన్నారు.