రేణిగుంట, జూన్ 01.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా మంజూరు చేసిన రైల్వే జోన్ ఈరోజు అధికారికంగా ప్రారంభం కావడం శుభపరిణామమని రేణిగుంట రైల్వే పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి. జయంత్ కుమార్ పేర్కొన్నారు. జోన్ ప్రారంభోత్సవం సందర్భంగా రేణిగుంటలో రైల్వే సంఘాలు, పెన్షనర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మిఠాయిలు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జయంత్ కుమార్ మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే దీనితో పాటు రాయలసీమ ప్రాంత రైల్వే నెట్వర్క్ బలోపేతానికి 'బాలాజీ డివిజన్' ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు కావడం వల్లనే ఈ ప్రాంతం అన్ని విధాలా పారిశ్రామికంగా, రవాణా పరంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రయాణికుల అవసరాలను, రైల్వేకు ఇక్కడి నుండి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాలాజీ డివిజన్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో బాలాజీ డివిజన్ సాధన కమిటీ కన్వీనర్ కె. గిరిధర్, నాగేంద్ర, బి. సుధాకర్, ఎన్. శ్రీనివాసులు పాల్గొని బాలాజీ డివిజన్ ప్రాధాన్యతను వివరించారు.
అలాగే రేణిగుంట రైల్వే పెన్షనర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఎస్. హసన్ సాహెబ్, ట్రెజరర్ ఏ. అన్బు, సహాయ కార్యదర్శులు ఏ. రవీంద్రబాబు, జ్ఞాన శేఖర్, కే. రంగయ్య, ఎస్కే. మునీర్ భాష, టి. సుబ్రహ్మణ్యం, వి. షణ్ముగం, పోసిన వెంకటేశ్వర్లు, నగరం వెంకటరమణ పాల్గొన్నారు.
వీరితో పాటు రేణిగుంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నగేష్, సి.ఆర్.ఎస్ సెక్రటరీ కె. బాబు, సి.ఆర్.ఎస్ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ కె. సదాశివరెడ్డి, చైర్మన్ కే. బాబు మరియు ఇతర రైల్వే సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.

