
గద్వాల జిల్లా మనధ్యాస మే 31
కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా నుంచి గద్వాల జిల్లా ధరూర్, కేటిదొడ్డి మండలాలోని పలు గ్రామాలకు అక్రమ ఇసుక రవాణ యథేచ్చగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా
రాయచూర్ జిల్లా కృష్ణా నది నుంచి ఆయా మండలాలోని పలు గ్రామాలకు నిత్యం పగలు, రాత్రివేళలో అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ ల ద్వారా అక్రమ ఇసుక రవాణ జరుగుతున్న రెవెన్యూ, పోలీస్ , మైనింగ్ అధికారులు మాకేం పట్టన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుకమాఫీయా రెచ్చిపోతుంది. అక్రమ ఇసుక వ్యాపారులు అధికారులకు నెలమాముళ్లు ఇస్తున్నామని బహిరంగానే చెప్పుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది ఎదుటనే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇసుక వ్యాపారులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు దారితీస్తొంది. అక్రమ ఇసుక రవాణ అడ్డుకట్ట వేయాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు.