తిరుపతి వరదరాజుల నగర్‌కు చెందిన శ్రీమతి అత్తూరు వాణి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసి తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి వాణి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాణి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశి,వాణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

