కార్యకర్తలకు స్వయంగా భోజనాలు వడ్డించిన తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి పార్లమెంట్ 5వ క్లస్టర్ బి.జి.కె. యాదవ్ ఆధ్వర్యంలో 'వర్చువల్ మహానాడు' కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపారు.
ఈ సందర్భంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 'మై టీడీపి యాప్'లో చురుకుగా పాల్గొని 5వ స్థానంలో నిలిచిన మహిళా నాయకురాలి సేవలను పార్టీ గుర్తించింది.
పార్టీ అధిష్టానం నుండి ఆమెకు వచ్చిన ప్రత్యేక గుర్తింపును తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేసి, ఘనంగా సత్కరించారు.
మహిళలు రాజకీయాల్లో మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
సత్కార కార్యక్రమం అనంతరం, పార్టీ అధినాయకత్వం ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో జరిగిన 'మహిళా బిల్లు' చర్చా కార్యక్రమాన్ని తుడా చైర్మన్ శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు.
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు అని చాటిచెబుతూ, 5వ క్లస్టర్ వర్చువల్ మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో తుడా చైర్మన్ తన సామాన్యత్వాన్ని చాటుకున్నారు.
కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ఆయన స్వయంగా భోజనాలు వడ్డించి వారి పట్ల తనకున్న ఆత్మీయతను, అభిమానాన్ని ప్రదర్శించారు. చైర్మన్ స్వయంగా వడ్డించడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

