
మన ధ్యాస,కామారెడ్డి ,
ఇటీవల బాన్స్ వాడ లో జరిగిన సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పోలీసుల పనితీరుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఒక మాఫియాగా మారారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.ఒక పేదోడు ట్రాక్టర్ లో ఇంటికి కోసం ఇసుక తీసుకువెళ్తే పోలీసులు పట్టుకొని వారికి వాహనాలు సీజ్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.తన కళ్ళముండి మహారాష్ట్ర కు చెందిన ఇసుక మాఫియా ట్రాక్టర్ లో నిండా ఇసుక తరలించబోతుంటే ఈ విషయాన్ని తాను లొకేషన్ తో సహా పోలీసులకు సమాచారం అందిస్తే వారు వీడియో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేశారని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆరోపించారు.ఈ విషయంపై ఆయన మంగళవారం స్పందించారు.పోలీసులు అంటే తనకు సంపూర్ణంగా గౌరవం ఉంది.కానీ ఎవరి విధులు వారు నిర్వహించుకుంటే నియోజకవర్గాలు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా తోట లక్ష్మీకాంతరావు వెల్లడించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎస్కార్ట్ తొలగించడం పై ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ తొలగించకుండా తనకే ఎస్కార్ట్ కామారెడ్డి పోలీసులు తొలగించడం చాలా సంతోషంగా ఉందని తనకు అధికారులు, పోలీసులు తో పనిలేదు కానీ తాను జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చానే తప్ప ఆస్తులు కూడా పెట్టుకోవడానికి రాలేదని ప్రజలకు సేవ చేసి వారి మన్ననలు పొందాలని ఉద్దేశమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వెల్లడించారు. తనకు నియోజకవర్గ ప్రజలు వారి నాకు అండ,వారే నాకు ఎస్కార్ట్ అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కామారెడ్డి పోలీసులు తనకు ఎస్కార్ట్ తొలగించడం పట్ల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సంతోషం వ్యక్తం చేశారు. తాను వద్దు అనుకున్న కామారెడ్డి పోలీసులు తనకు ఎస్కార్ట్ తొలగించడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.జుక్కల్ నియోజకవర్గ ప్రజలు తనకు అండదండలు ఉన్నన్ని రోజులు వారికి సేవ చేసుకోవడమే నా కర్తవ్యం అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.