
మన ద్యాస, నెల్లూరు, మే 25 : నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం 'హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ (హెచ్ 2O)' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఉచితంగా వాటర్ డిస్పెన్సర్‌ను వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు భవేష్ జైన్, వికాస్ జైన్, అభిషేక్ జైన్, పంకజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భవేష్ జైన్ మరియు అభిషేక్ జైన్ మాట్లాడుతూ....... సమాజంలో నిరంతరం వార్తా సేకరణలో నిమగ్నమై ఉండే జర్నలిస్టులకు తమ వంతు సాయంగా ఈ వాటర్ డిస్పెన్సర్‌ను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియా ప్రతినిధుల సంక్షేమానికి, సౌకర్యాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని వారు కోరారు. రాబోయే రోజుల్లో కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ (హెచ్ 2O) తరపున మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొని, వాటర్ డిస్పెన్సర్‌ను విరాళంగా అందించినందుకు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
