మన న్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో శ్యామల (38) అనీమియా వ్యాధితో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కరక్ వాడి గ్రామానికి చెందిన సంగోల్ల రజనీకాంత్ మానవతా దృక్యంతో వెంటనే స్పందించి కెవిఎస్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రక్త నిలువలు లేకపోవడం వలన వివిధ చికిత్సల నిమిత్తమై వచ్చే పేషెంట్లకు సకాలంలో రక్తం దొరకడం లేదని రక్తదానానికి యువత ముందుకు రావాలని అన్నారు.రక్తదాతకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరపున అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాజంపేట రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ప్రసాద్,కేబిఎస్ రక్తనిధి ప్రతినిధులు జీవన్,వెంకటేశ్ లు పాల్గొనడం జరిగింది.