
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: విద్యార్థులు కష్టపడే చదివి ఉన్నత స్థాయిలో రాణించి తల్లిదండ్రులతో పాటు, గురువులు, తమ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేరడుగం మఠాధిపతి పంచమ సిద్ధ లింగస్వామి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన బిటిఎం సేవా ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధ లింగస్వామి... ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని మక్తల్ మాగనూరు కృష్ణ ఉట్కూరు నర్వ ఐదు మండలాలకు చెందినసుమారు 200 పైగా ఇంటర్ పదో తరగతిలో మండల్ టాపర్లతోపాటు... ప్రతి స్కూలు కాలేజీ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. బి టి యం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిమ్మయ్య మాట్లాడుతూ... ఆర్థికంగా వెనుకబడి అత్యుత్తమంగా రాణించే విద్యార్థులకు తమ ఫౌండేషన్ అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అనంతరం ఇటీవల డాక్టరేట్ సంపాదించిన తిమ్మయ్యను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహా వ్యవస్థాపకులు గరిడి నరేందర్, రైతు ఆత్మహత్యల గోస పుస్తక రచయిత పులి రాజు, రిటైర్డ్ హెచ్ ఎం రాఘవేంద్ర రావు,అయ్యప్ప అడ్వకేట్, మార్కెట్ డైరెక్టర్టి నాగరాజు, ముడుమల్ మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్, సత్యనారాయణ, బీటీఎం సేవా ఫౌండేషన్ సభ్యులు ,క్రిష్ణయ్య, వెంకట్, సోఫీ ,రవి కుమార్,నింగప్ప చంద్ర శేఖర్ ,శ్యామ్ ఫార్మర్ హనుమoతు , తదితరులు పాల్గొన్నారు.