
మన న్యూస్:ఇబ్రహీంపట్నం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.విష్ణువర్ధన్ రెడ్డిని ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఆదిభట్ల మున్సిపాలిటీలోని టీసిఎస్ కంపెనీ నుండి ఆదిభట్ల జంక్షన్ ఏరోస్పేస్ మీదుగా నాదర్గుల్ వెళ్లే ప్రధాన రహదారిని సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు నాలుగు లైన్ల రోడ్డును ఏర్పాటుచేసి ఈ రోడ్డు మార్గానికి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రతన్ టాటా పేరును పెట్టాలని కోరారు. టిసిఎస్ ఆవరణలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు,ఈ విషయంపై టీజిఐఐసి ఎండీ డా.విష్ణువర్ధన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డికి తెలియపరచగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారని అన్నారు.