తిరుపతి మే 23. తిరుపతి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నేరాలకు నేరస్థులకు చోటు లేదని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీఎల్. సుబ్బరాయుడు. ఐపిఎస్. తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 450 మంది రౌడీ షీటర్లు, గంజాయి నిందితులు,ఫోక్సొ కేసుల ముద్దాయిలకు నిర్వహించిన ప్రత్యేక మెగా కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పవిత్రమైన తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబడును స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో 13 మంది రౌడీ షీటర్ల పై పీడీ యాక్ట్ గంజాయి విక్రయిస్తున్న 17 మందిపై పిఐటి - ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. నేరస్తులలో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని ఒకవేళ పద్ధతి మార్చుకోకుండా పదేపదే నేరాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేయడానికి వెనుకాడపుమని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ అత్యాధునిక సాంకేతికను ఉపయోగిస్తుందని ఐదు నిమిషాలలో ఫలితాన్ని ఇచ్చే యూరిన్ టెస్ట్ కిట్ల ద్వారా గంజాయి సేవించే వారిని గుర్తించి వారి వెనుక ఉన్న సరఫరాదారుల మూలాలను అణిచివేస్తామని తెలిపారు. మహిళలు మరియు చిన్నారుల భద్రత విషయంలో తమ శాఖ రాజీ లేని పోరాటం చేస్తుందని ప్రజలు భయాందోళనకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యం అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవి మనోహర చారి, శ్రీనివాసరావు, శ్రీనివాస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



