
మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా తంగిడి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో పాస్ట్ రీజియన్ చైర్మన్లయన్ రమేశ్ రావు ఎన్నికల అధికారి గా వ్యవహరించగా, సభ్యులు అందరూ కలిసి నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2026-27 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ మఖ్తల్ భీమా నూతన అధ్యక్షుడిగా తంగిడి నాగరాజు, సెక్రటరీ గా రమేశ్ రావు, కోశాధికారిగా అంబాదాస్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సభ్యులందరూ నూతన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. డిస్ట్రిక్ట్ 320ఏ లో మఖ్తల్ లయన్స్ క్లబ్ కు ప్రత్యేక స్థానం ఉందని, సేవా కార్యక్రమాల్లో రాష్ట్రం లోనే ముందంజలో ఉన్నఅతి కొద్ది లయన్స్ క్లబ్ లలో మఖ్తల్ క్లబ్ కూడా ఉందని, ఇదే సాంప్రదాయాన్ని నూతన కమిటీ కూడా కొనసాగించాలని కోరారు. అనంతరం 2025-26 కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు సత్యాంజనేయులు, సెక్రటరీ అంజన్ కుమార్, కోశాధికారి ఆడెం సత్యనారాయణ... నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలిపి, అతి త్వరలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేసి, బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ రీజియన్ చైర్మన్ డాక్టర్ శ్రీరామ్, సీనియర్ సభ్యులు బి.కొండయ్య, కోళ్ల వెంకటేష్, అనుగొండ శ్రీనివాస్, గవినోళ్ల జైపాల్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ మణికంఠ గౌడ్, సభ్యులు సుకన్య శేఖర్, సాయి జ్యోతి వెంకటయ్య, వట్టం రతన్ కుమార్ గుప్తా, కిరణ్, అశోక్, పాపిరెడ్డి, రఘురాం, అరుణ టీచర్, సుజాత టీచర్, జయశ్రీ టీచర్, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
