
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) : దళారులను నమ్మిరైతులు మోసపోవద్దని డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు,నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తో కలిసి కొబ్బరికాయలు కొట్టి కాటా పై జొన్న సంచిని పెట్టి కొనుగోలు ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ .రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానలక్ష్యమన్నారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా పారదర్శకంగా జొన్న సేకరణ చేపడుతున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వం 1 క్వింటాలుకు 3699 రూపాయలను అందిస్తుందన్నారు.రైతులు పండించిన జొన్నలకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.గ్రామీణ ప్రాంత రైతులకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతోఉపయోగపడతాయని తెలిపారు.రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజా పండరి, బిచ్కుంద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగ్నాథ్ పటేల్, మంగ్లూర్ గ్రామ సర్పంచ్ రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చాకలి సాయిలు, సొసైటీ సీఈవో సంగమేశ్వర గౌడ్, నాయకులు గరబోయిన వెంకటేశం, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.