
ఐరాల మనద్యాస మే 22
జనసేనపార్టీ,చిత్తూరు జిల్లా గత రెండు రోజుల క్రితం రాజకీయ విశ్లేషకులు,మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన పార్టీ అధినేత,ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నిరాధార ఆరోపణలు, గందరగోళం సృష్టించే వ్యాఖ్యలను ఎప్పటికీ ఉపేక్షించేది లేదని,అలాంటి వారు ఎవరైనా సరే వారిని ఊరికే వదిలిపెట్టేది లేదని జనసేనపార్టీ, చిత్తూరు జిల్లా నాయకులు ఎం.మహేష్ స్వేరో హెచ్చరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, జనసేనపార్టీ అధినేత,జనసేనాని పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడు ప్రజల క్షేమం కొరకు,ప్రజా సమస్యలపై,రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసే వ్యక్తి అని, ఎలాంటి స్వార్థం లేకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంత త్యాగానికైనా సిద్ధపడే మహోన్నతమైన వ్యక్తి అని,ఆయన పనితీరు,రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న విశిష్ట కృషిని చూసి ఓర్వలేక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరొక చిచ్చు పెట్టడానికి పూనుకొని నీచ రాజకీయాలు చేయడం మళ్లీ మొదలెట్టింది. ఆ పంథాలో భాగంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ద్వారా చిల్లర కామెంట్లు చేయించడం, జనసేన పార్టీ పై మరియు పవన్ కళ్యాణ్ పై లేనిపోని నిందని మరియు కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టించి సమాజానికి,ఆయన్ని అభిమానించే కోట్లాదిమంది ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా పూనుకోవడం నిజంగా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చౌకబారు మరియు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి,యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత గతంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఎన్నో వ్యక్తిగత విషయాల గురించి, బహిరంగంగా అత్యంత నీచంగా మాట్లాడినప్పటికీ తాను ఎప్పుడూ వారి వ్యక్తిగత విషయాలపై మాట్లాడలేదని అంతా ఇబ్బందికరంగా పరిస్థితుల్లోనూ ఎంతో హుందాగా నడచుకున్న మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు కొందరు పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా పిచ్చిపిచ్చి కామెంట్లు చేసి గందరగోళానికి గురి చేయడం మానుకోవాలని తెలిపారు. కనీస ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలు మానుకోవాలని,పవన్ కళ్యాణ్ పై మరియు జనసేన పార్టీపై ఎలాంటి నిరాధార ఆరోపణలు చేసిన,రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రపూరిత చర్యలు చేయాలని చూసిన ఎవర్ని ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏది చేసినా రాష్ట్ర అభివృద్ధి కొరకే ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలపై మరియు ప్రాజెక్టులపై మాట్లాడడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని ఢిల్లీలో కలవడం జరిగిందని దానిని వేరొక విధంగా చిత్రీకరించడం వైసిపి చౌకబారు రాజకీయాలకి రుజువని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకే కృషి చేస్తారని దేశంలో అత్యంత పేరొందిన నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు ఘటిస్తున్న కళ్యాణ్ పై ఇకనైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి పై కేంద్ర హోమ్ శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి లేదని,అలాంటి దిగజారుడు రాజకీయాలు శ్రీ పవన్ కళ్యాణ్ ఎప్పటికీ చేయరని దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు.