చిత్తూరు డిసెంబర్ 16 మన న్యూస్
చిత్తూరు నగరంలో కొత్తగా ప్రారంభమైన సుమన్ టీవి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం చిత్తూరులోని కట్టమంచిలో నూతనంగా ప్రారంభించిన సుమన్ టీవి కార్యాలయం వద్దకు చేరుకున్న *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ కి* సుమన్ టీవి ప్రతినిధులు పుష్పగుఛ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. సుమన్ టీవి ప్రారంభోత్సవం సందర్భంగా సుమన్ టీవి బృందాన్ని మురళీమోహన్ గారు అభినందించారు. వారి భవిష్యత్తు కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ ప్రసంగిస్తూ.. సుమన్ టీవి ప్రజలకు సమగ్ర సమాచారం అందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. సమాచార ప్రసారంలో సుమన్ టీవి కొత్త ఒరవడి సృష్టించాలని ఆకాంక్షిస్తూ, మీడియా రంగం సమాజానికి సేవ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. సుమన్ టీవి ద్వారా ప్రజల సమస్యలు వెలుగులోకి రావడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వరకు తీసుకెళ్లేందుకు ఇది ఒక మంచి వేదిక అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.