కాణిపాకం డిసెంబర్ 16 మన న్యూస్
శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణధికారి కార్యాలయం నందు సమావేశం లో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ , అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం నందు ఈ,వో మాట్లాడుతూ దేవస్థానం విచ్చేయు భక్తులతో మర్యాదపూర్వకంగా సంబోధించండి విధులు పట్ల సక్రమంగా హాజరై విధిగా విధులు నిర్వహించండి, లేనియెడల క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, పరిసరాలలో బస్టాండు ప్రాంతాల్లో పరిశుభ్రతను నిర్వహించాలి దర్శనార్థం విచ్చేయు భక్తులకు సక్రమంగా దర్శన ఏర్పాట్లు నిర్వహించాలి వివిధ అంశాలపై సిబ్బందితో చర్చించి సూచనలు జారీ చేశారు ఈ సమావేశం నందు ఏ ఈ ఓ లు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరి మాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, సూపర్డెంట్లు వాసు, బాలరంగస్వామి, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.