ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 19, 2026, 9:38 pm
తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సోదరి అయిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిలకు గంగమ్మ దేవస్థానం ఛైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం మంత్రి అనగాని సత్యప్రసాద్, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి కి దేవస్థానం ఛైర్మన్ మహేష్ యాదవ్ గజమాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం వారు అమ్మవారి మూలవిరాట్టును దర్శించుకుని, ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సస్యశ్యామలం కావాలని అమ్మవారిని ప్రార్థించారు.
దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రికి, తుడా ఛైర్మన్‌కు వేద ఆశీర్వచనం పలికారు.
ఛైర్మన్ మహేష్ యాదవ్ వారికి అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం మరియు అమ్మవారి పవిత్ర ప్రతిమను బహుకరించి గౌరవించారు.
ఈ కార్యక్రమంలో కూటమి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్ తెదేపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి, శ్రీధర్ వర్మ, పులిగోరు మురళి కృష్ణ,జిల్లా నాయకులు,దేవస్థానం బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.