ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'మత్స్యకార సేవ' కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి వర్చువల్గా హాజరై, మత్స్యకారుల సంక్షేమం, వారి ఆర్థిక వృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారుల సమస్యలు, వారికి అందాల్సిన వసతులపై ప్రజాప్రతినిధులతో కలిసి విస్తృతంగా చర్చించారు.
మత్స్యకార సోదరుల జీవితాల్లో స్థిరమైన ఆర్థిక మార్పు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పార్టీ అధినాయకత్వ మార్గదర్శకత్వంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి సంక్షేమ ఫలాలు సకాలంలో అందుతున్నాయో లేదో క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం గంగపుత్రుల అభ్యున్నతికి, వారి హక్కుల రక్షణకు నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



