
మన ధ్యాస ,నిజాంసాగర్(జుక్కల్): వర్షాకాల సమయంలో ప్రజలు, ప్రయాణికులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. వరదల్లో చిక్కుకున్న సందర్భాల్లో అగ్నిమాపక, రెస్క్యూటీం సభ్యులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేరుస్తారన్నారు.మహమ్మద్ నగర్ మండలం బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ ఆధ్వర్యంలో మాక్ ఎక్సర్సైజ్ చేపట్టారు.బాన్సువాడ ఆర్డీవో హాజరై మాట్లాడారు…వర్షాలు, వరద నీటి ప్రవాహాల సమయంలో జాగ్రత్తల గురించి వివరించారు.వరద ముప్పు నుంచి జీవాలను కాపాడే తీరును వివరించారు. వరదల సమయంలో మూగజీవాలు ప్రజలను ఏ విధంగా కాపాడాలని దానిపై వారికి ఆవున కల్పించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లత, ఎంపీడీవో
సత్యనారాయణరెడ్డి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి భరత్, ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్, హసన్ పల్లి సర్పంచ్ బోయిని హరికుమార్,తదితరులు హాజరయ్యారు.

