
కావలి(మే14, ) మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
యు. టి. యఫ్ కావలి రూరల్ మండలశాఖ ఆధ్వర్యంలో, శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు గురువారం పదవతరగతి పరీక్షా ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనపరచిన ప్రభుత్వ బాలబాలికల అభినందన సభను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా యు.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ, జిల్లా కార్యదర్శి ఐ హెచ్ ఎల్ ప్రసాద్ లు విచ్చేసి మాట్లాడుతూ యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సామాజిక స్పృహలో భాగంగా జిల్లాలోనే మొదటగా, విజయవంతంగా అభినందన సభను నిర్వహించిన మండల శాఖను అభినందించారు. కరువు కాటకాల నుండి కరోనా వరకు సామాజిక స్పృహతో యుటిఎఫ్ చేపట్టిన కార్యక్రమాలను గురించి వివరించారు. భావి భారత పౌరులైన మీరందరూ తల్లిదండ్రుల కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలని బాలబాలికలను కోరారు.తల్లిదండ్రులు ఇంటర్ విద్య పూర్తి అయ్యేంతవరకూ వారితో మమేకం కావాలన్నారు.సమావేశానికి అధ్యక్షత వహించిన ముజీబ్ అహ్మద్,మండల ప్రధాన కార్యదర్శి జి. వేణుగోపాల్ లు మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, ధూమపానం, మద్యపానం, మూఢనమ్మకాలకు దూరంగా ఉండకపోతే విజేతలైన విద్యార్థులకు,సమాజానికి జరిగే అనర్థాలను కూలంకషంగా వివరించారు. ఆర్థిక కార్యదర్శి పి.చెన్న క్రిష్ణయ్య, రాజరాజేశ్వరి, సలీం విశ్రాంత ఉపాధ్యాయులు గౌస్ బాషా, అజిత్ బాబు, అంకుల్, హజరత్తయ్య, సిద్ధిక్, జయరాజ్, అజిత్ బాబు, ఎం కొండయ్య, ఎస్. సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ బాలబాలికలందరూ గతాన్ని స్ఫూర్తిగా తీసుకొని,బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సెల్ ఫోను, టీవీ లతోపాటు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలన్నారు.ఎంత స్థాయికి చేరుకున్నా తల్లిదండ్రులను వృద్ధాప్యంలో మరవకుండా బాధ్యతగా చూసుకోవాలని ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 10 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు వారి తల్లిదండ్రులు, యు. టి. యఫ్ నాయకులు, కార్యకర్తలు వంద మందికి పైగా విచ్చేసి మాట్లాడారు. అత్యంత ప్రతిభ కనపరచిన విద్యార్థినీ, విద్యార్థులను, దానికి కారకులైన ప్రధానోపాధ్యాయులను, దాతలను శాలువా, మెమోంటో, సర్టిఫికేట్ బిగ్ ఫైల్ ను అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం నిర్వహించిన మండలశాఖను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలువురు అభినందించారు.