తిరుపతి మే 13:*
పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఈరోజు విడుదలైన 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపులలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సత్తాచాటారు.
పి.సి.ఎం గ్రూపులో 500 మార్కులకు గాను ఇ. ఉదయశ్రీ 470 మార్కులతో మొదటి స్థానం సాధించగా, జి. వెంకి 468 మార్కులు, వి. శశాంక్ 462 మార్కులు సాధించారు.
అదేవిధంగా పి.సి.ఎం.బి గ్రూపులో బి. మొనితా చౌదరి 423 మార్కులు సాధించగా, పి.సి.బి గ్రూపులో డి. కృష్ణ హరిణి 411 మార్కులు సాధించారు.
కామర్స్ గ్రూపులో జె. రుష్మిత 468 మార్కులు సాధించగా, ఎం.ఇ.సి గ్రూపులో బి. అక్షయ రెడ్డి 444 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభపై అమరరాజా విద్యాసంస్థల వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్, ప్రిన్సిపాల్ ధనంజయ నాయుడు విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.






