
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(గాజువాక)మే13:గాజువాక 73 వ వార్డు కొలెస్ట్రి ఇంచార్జ్ బాలి నాయుడు ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో భాగంగా బాలు నాయుడు కేక్ కట్ చేసి తోటి సహచరులతో కలిసి మిత్రులకు శ్రేయోభిలాషులకు టిడిపి కార్యకర్తలు అందరికీ కూడా కేక తినిపించడం జరిగింది.73 వార్డ్ జీవీఎంసీ మహిళా వర్కర్ల అందరికీ కూడా చీరల పంపిణీ చేయడం. ప్రజల దాహార్తి దించేందుకు శీతల పానీయంతో పాటు నిత్యం ప్రజలకు మజ్జిగను కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలు నాయుడు మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుని పదవితోపాటు మంత్రి మండలి లో కూడా అవకాశం కల్పిస్తారని ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఉండటం తొందర్లో దాని పైన కూడా ప్రతి నిర్ణయం చెపుతారని టిడిపి కార్యకర్తలు అందరూ కూడా ఎదురుచూస్తున్న వైనం. గాజువాకలో అభివృద్ధి నిమిత్తం రోడ్లు డ్రైనేజీలు వ్యవస్థ ఇతర ఇబ్బందులను ప్రజలకు తలెత్తకుండా అన్ని విధాలుగా కూడా అన్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాక ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు మనీకమై ప్రజా సమస్యలను నెరవేరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద వేల కోట్ల రూపాయలు తేవడానికి ఆయన అహర్నిశలు శ్రమించడం గాజువాక ప్రజలు మరువలేనిది అని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన పళ్ళ శ్రీనివాసరావుని ప్రజల గుండెల్లో చూసుకుని అద్భుత మెజార్టీతో గెలిపించడం జరిగింది. వాడ వాడలా కూడా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రజలు కార్యకర్తలు అభిమానులకు నా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కే కృష్ణ, బి రాజారావు, పి. శ్రీను,కే శ్రీను, వి స్వామి నాయుడు, పి బాబు, నాగిరెడ్డి నరసింహ, ఇతర టిడిపి కార్యకర్తలు కూటమి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.