నర్సులు ఆధునిక యుగపు 'ఫ్లోరెన్స్ నైటింగేల్స్'
ఎమర్జెన్సీ వార్డుల్లో నర్సులు చూపే తెగువ, ఓర్పు వర్ణనాతీతం- తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి…
రేణిగుంట మన ధ్యాస మే 12.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ లో 116వ అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
స్విమ్స్ ఆవరణలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముక్య, విశిష్ట అతిథులు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:116వ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తించడం మన బాధ్యత.
రోగి ఆస్పత్రికి రాగానే, అత్యవసర పరిస్థితిలో రక్తాన్ని, గాయాలను చూసి భయపడకుండా, తన కుటుంబ సభ్యుల కంటే మిన్నగా ప్రేమను చూపిస్తూ సేవ చేసేవారు నర్సులు.
రాత్రింబవళ్లు కష్టపడుతూ, రోగి కోలుకునే వరకు వెన్నంటే ఉండే వారి త్యాగం సాటిలేనిది.
ఒకప్పుడు నర్సింగ్ చదువు అంటే పరిమితమైన అవకాశాలు ఉండేవని, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో పాటు ఈ రంగం రూపురేఖలే మారిపోయాయని తెలిపారు.
కేవలం సేవ మాత్రమే కాకుండా, నేడు నర్సింగ్ అనేది అత్యున్నత గౌరవం మరియు ఆర్థిక భరోసా ఇచ్చే వృత్తిగా మారిందన్నారు.
ప్రస్తుతం ఒక్క డాక్టర్ ఉన్నచోట కనీసం 50 మంది నర్సుల అవసరం ఉంటోంది.
దీనివల్ల నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో అద్భుతమైన కెరీర్ అవకాశాలు, ఆకర్షణీయమైన ప్యాకేజీలతో కూడిన ఉద్యోగాలు లభిస్తున్నాయి.
విద్యార్థులంతా ఈ అవకాశాలను అందుకుని, మానవత్వంతో కూడిన సేవలను అందించాలని పిలుపునిచ్చారు.
స్విమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో శిక్షణ పొందుతున్న వారు భవిష్యత్తులో ఉత్తమ ఆరోగ్య సేవకులుగా ఎదుగుతారని ఆకాంక్షించారు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ చూపిన బాటలో నడుస్తూ, స్విమ్స్ నర్సులు అందిస్తున్న సేవలు తిరుపతి కే గర్వకారణమని తెలిపారు.
స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. వి. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ఉత్తమ నర్సుల కు అవార్డుల ప్రదానం చేశారు.
ముక్య, విశిష్ట అతిథులను స్విమ్స్ కళాశాల వైద్యులు, నర్సులు ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి. సుధారాణి , నర్సింగ్ సూపరింటెండెంట్ సి. సునీత , వైద్యులు మరియు పెద్ద సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు..




