మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉండడంతో రాష్ట్రస్థాయి సర్పంచుల ఫోరం సంఘం పిలుపు మేరకు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.నిజాంసాగర్ మండలంలోని పరిధిలోని తాజా మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు.పోలీస్ స్టేషన్ లో గంటపాటు ఉన్న సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ సొంత సూచికత్తుపై పోలీసులు విడుదల చేశారు.ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ.అసెంబ్లీ ముట్టడించడానికి వెళ్తున్నారని సమాచారంతో ఉద్దేశంతోనే తనను పోలీసులు అరెస్టు చేశారని ఆయన అన్నారు.ప్రభుత్వం బేషరతుగా మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వనికి డిమాండ్ చేశారు.