
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఐకెపి ఏపీ ఎం ప్రసన్న రాణి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలును ఏపిఎం, గ్రామ సర్పంచ్ బోయిని హరికుమార్ తో కలసి పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.రైతులకు కావలసిన వసతులు చేయడం జరిగిందని అన్నారు. వారి వెంట ఐకెపి సిసి శ్రీకాంత్,తదితరులు ఉన్నారు.