
కలిగిరి, మే 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
కలిగిరి మండల కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొల్లినేని వెంకట రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బొల్లినేని వెంకట రామారావు కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి సన్మానించారు.అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆలయ అభివృద్ధి కోసం రూ.50 వేల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.భక్తుల ఆధ్యాత్మిక చైతన్యానికి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.