
కొండాపురం , మే 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
కొండాపురం మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన కొమ్మి సుధాకర్ కుమార్తె చి॥ల॥ సౌ॥ మనీషా గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు హాజరై నూతన వధువును ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన, మనీషా దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాఫల్యంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మామిళ్ళపల్లి ఓంకారం కావలి పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు తటవర్తి రమేష్, బిజెపి రాష్ట్ర నాయకులు మాధవ , గ్రామ పెద్దలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.