ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 7, 2026, 10:16 am
అవిలాల గంగమ్మకు వైభవంగా సారే సమర్పించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ ప్రజల ఆరాధ్య దైవం, శక్తి స్వరూపిణి శ్రీ అవిలాల గంగమ్మ జాతర మహోత్సవాలు అంబరాన్నంటాయి.
జాతరలో భాగంగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి బుధవారం అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలతో కూడిన సారే ను సమర్పించారు.
అవిలాల గ్రామానికి చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మంగళ హారతి తో ఘన స్వాగతం పలికారు.
మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ డాలర్స్ దివాకర్ రెడ్డి సారే ను ఊరేగింపు గా తీసుకొని ఆలయానికి చేరుకున్నారు.
గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,అమ్మవారి కృపాకటాక్షాల తో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అవిలాల కూటమి నాయకులు స్థానికులు పాల్గొన్నారు.