ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 6, 2026, 8:43 am
శెట్టిపల్లి రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి .
తుడా కార్యాలయంలో మంగళవారం శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, శెట్టిపల్లి గ్రామ రైతులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న కొన్ని సాంకేతిక ఇబ్బందులను మరియు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.
రైతులతో మాట్లాడిన చైర్మన్, దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించి, రైతులకు పూర్తి హక్కులు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పునరుద్ఘాటించారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎటువంటి జాప్యం లేకుండా సాగేలా చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
సాంకేతిక కారణాలతో ఆగిపోయిన పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ కి శెట్టిపల్లి రైతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.