సామాజిక బాధ్యతగా చలివేంద్రం ఏర్పాటు…
మంగళం డిపో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్టార్ కృష్ణ చొరవ….
రేణిగుంట మే 5.
తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ ఆలోచన మేరకు మంగళం డిపో మేనేజర్ సుధాకర్ సూచనలతో మంగళం డిపోలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న స్టార్ కృష్ణ మంగళవారం, ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేట బస్ స్టాండ్ కూడలిలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టార్ కృష్ణ మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రయాణీకుల దాహార్తిని తీర్చడం ఒక సామాజిక బాధ్యతగా భావించిన తిరుపతి రీజనల్ మేనేజర్ జగదీష్ ఆలోచనలకు అనుగుణంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు స్టార్ కృష్ణ తెలిపారు. ఈ మంచి కార్యక్రమంలో పాపానాయుడు పేట కు చెందిన నాయకులు అర్జున్ బాబు, వడివేలు, దొర కృష్ణా మరియు రమేష్, చెంగలరాయులు,అర్జున,తిరుమల, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.
