
బద్వేలు, మన ధ్యాస మే 1:
కార్మికుల శ్రమను గుర్తించి వారికి భరోసా కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమని డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాయ కష్టమే ప్రపంచాన్ని కి ఆధారమని శ్రమైక జీవనమే సమాజానికి మూలమని అన్నారు. లోకాన్ని నడిపించే శక్తి కార్మికులదని తమ చెమట చుక్కలతో దేశ ప్రగతికి బాటలు వేసేది కార్మికుడే నని వారన్నారు. తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ అని కార్మికులు, కర్షకుల శ్రమను గుర్తించి వారి అభ్యున్నతి కోసం పాటుపడే నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధుల స్ఫూర్తి వెలకట్టలేని దని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు.