

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ పోస్ట్):మే డే కార్మికుల ఐక్యత,పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందనివిశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు,32 వ వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.ఆర్టీసీ కాంప్లెక్ ఔట్ పోస్ట్ వద్ద మే డే ఉత్సవాన్ని పరిష్కరించుకునిఆటో,రిక్షా కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్య కందుల నాగరాజు మాట్లాడుతూ మే డే.. దీనినే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా అంటారని పేర్కొన్నారు. కార్మికులకు గౌరవంతో కూడిన రోజు అని కూడా తెలిపారు.ప్రతి సం|| మే 1న దీనిని జరుపుకుంటారని చెప్పారు.కానీ అమెరికాలో మాత్రమే దీనిని లాయాల్టీ డేగా జరుపుకుంటారని,అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.కార్మికుల పోరాట,కార్మికుల ఐక్యతకు గుర్తుగా ఈరోజును జరుపుకుంటారని వెల్లడించారు.కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో శ్రమ దోపిడిని నిరసిస్తూ కార్మికుల్లో స్పూర్తిని రగిలిస్తూ వేసిన ముందుడుగే ఈ మేడే అన్నారు.మనదేశంలో ఇతర దేశాల కంటే ముందే కలకత్తాలో కార్మికుల పనిగంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లోనే సమ్మె చేశారని చెప్పారు.1923లో తొలిసారిగా భారత్ దేశంలో మే డే ను పాటించారని,ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైందన్నారు.దీంతో మే డే పాటిస్తున్నారని అన్నారు.అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చిందన్నారు.రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా దేశాల్లో మే 1ని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారన్నారు.అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయని,చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి వచ్చాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు వామన మూర్తి,సిపిఐ బుజ్జి, సెక్రెటరీ ఉదయ్,వైస్ ప్రెసిడెంట్ నూకరాజు,ప్రెసిడెంట్ ఇ. రాజు,కె.కృష్ణ,కె.అప్పారావు,కేదార్నాధ్,బదిరీనాధ్,తదితరులు పాల్గొన్నారు.