మన న్యూస్:తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్ధానిక వైసిపి కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పి అమరుడైన యోధుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నగరంలోని పలు సేవా సంఘాలు,వర్తక వాణిజ్య సంఘాల నాయకులు,వ్యాపారస్తులు,వైసిపి నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఐక్యమత్యంతో మెలగాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు గోవర్ధన్ వాసవి క్లబ్ కోశాధికారి శ్రీధర్ జయచంద్ర గుప్తా శరవణ ధర్మేంద్ర,సత్య కృష్ణమూర్తి వైసీపీ నాయకులు కే పీ శ్రీధర్ రాసన పల్లి ప్రకాష్,కుమార్ నారాయణమూర్తి ముజీబ్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.