

మన ధ్యాస ప్రతినిధి గాజువాక (నడుపురు): నేడు విద్యాసంస్థల్లో నూ అటు విద్యార్థుల్లోనూ,విద్యార్థి కుటుంబ సభ్యులు,ఉపాధ్యాయులు ఒకటి ఆలోచన 10 వ తరగతి విద్యార్థులు ఎంత ఘనవిజయం సాధిస్తారని ఎదురు చూడవలసిన సమయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన సమయం నుంచి తల్లిదండ్రు కళ్ళల్లో వారి విద్యార్థుల ఫలితాల పైన ఆధారపడి ఉండేది.నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు. విద్యార్థుల పట్ల నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిరంతరం శ్రమించి చదివి అత్యున్నత విజయం.విద్యార్థుల జీవితాలను పునాది పదవ తరగతి ఫలితాలు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు గ్రామం గత కొంతకాలంగా పదవ తరగతి ఫలితాలు అత్యంత అద్భుతంగా రానివ్వడం.విద్యార్థులతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు రాచకొండ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిత్యం ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు ఏ విధంగా సిలబస్ పూర్తి చేయాలి అనే ఉద్దేశం లేకుండా విద్యార్థులకు అర్థమైంది ఏ విధంగా పూర్తి బోధనా సామర్థ్యం.2025 వ సం|| నుంచి మరొక 2026 వ సం||విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణలవ్వడమే కాకుండా విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచింది. 76%తో విద్యార్థులను ఉత్తీర్ణులు సాధించటం. విద్యార్థులకు,గురువులందరూ కూడా తన సొంత పిల్లలారా భావించి విద్యను బోధించడంతో ఇంత ఘన విజయానికి దోహదపడటం జరిగింది.65 మందికి పైగా 500 మార్కుల పైబడి రావటంతో పాటు.ముగ్గురు విద్యార్థులు వివరాలు దేవిక(592), పల్లవి(588), లోకేష్(587)అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. తల్లిదండ్రుల కోలాహలంతో ఉపాధ్యాయుల ఆనందంతో వాడవాడలా విద్యార్థుల విజయ పతాకాలను ఎగురవేస్తూ ఆనంద భాష్పాలతో నడుపురు హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు విజయం.