
పెద్దకొండూరు లో NTR పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు.
కలిగిరి మే 01, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందని బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. శుక్రవారం కలిగిరి మండలం పెద్దకొండూరు, పెద్దపాడు గ్రామం లో జరిగిన 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, ఆప్యాయంగా పలకరించి వారికి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ, గతంలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు పడ్డ కష్టాలను తొలగించి,నేడు గౌరవప్రదంగా ఇంటి వద్దకే రూ. వితంతువు, వృదప్య 4,000 పింఛన్ , వికలాంగులకు 6000 వేలు, డయాలసిస్ 10000 వేల రూపాయలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నారాని ఆయన అన్నారు, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.అంతే కాకుండా పెద్దకొండురు గ్రామం లో గంజాం మస్తాన్ అనే పెన్షన్ లబ్ధిదారుడు చనిపోయిన కారణంగా ఆయన భార్య అయినటువంటి గంజాం వెంగమ్మ కి వితంతువు పెన్షన్ అందించడం జరిగింది.అదేవిధంగా ద్రోణాదుల వెంకటేశ్వర్లు కి డయాలసిస్ పెన్షన్ 10000 వేల రూపాయలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మొక్క హజాత రావు 258 బూత్ కన్వీనర్ , ద్రోణాదుల రమేష్ 257 బూత్ కన్వీనర్, నీటి సంగ అధ్యక్షుడు ద్రోణాదుల రమేష్,sk ఉస్మాన్, మొద్దు మస్తాన్, గుర్రం ఏడుకొండలు, సచివాలయ సిబ్బంది, తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.
