
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఏప్రిల్ 30 :దక్షిణ నియోజకవర్గంలో 39వ వార్డులో ఒంటరిగా జీవిస్తున్న జాలారి వర్గానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ చింతపల్లి లక్ష్మణరావుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు.ఇక్కడి కొంతమంది యువత ఆ వృద్ధుడికి ఆసరా కల్పించగా చిన్న షెడ్ లో జీవితం సాగిస్తున్నాడు.39వ వార్డ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ముజీబ్ ఖాన్,స్తానిక యువత కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళారు.వాసుపల్లి గణేష్ విషయం తెలుసుకుని నేరుగా బాధితులు పరామర్శించి వారికి₹ 5,000/-లు ఆర్థిక సహాయం అందజేసి బాధితుడికి నేనున్నాను అనే భరోసా కల్పించారు. బాధితుడు మెరుగైన వైద్యం గురించి కేజీహెచ్ సూపరింటెండెంట్ తో మాటాడి మెరుగైన వైద్యం అందించాలని వాసుపల్లి కోరారు.అవసరమైన మెడికల్ ఖర్చులకు తాను సహాయం చేస్తానని వాసుపల్లి దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో సత్య,వెంకటి,సలీం,ధనరాజు,రవి, కాసుబాబు,స్టేట్ నాయకులు సంస్కృత విభాగం సెక్రెటరీ సాగర్,చేపల నూకరాజు 39 వ వార్డు వైసిపి శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలుపాల్గొన్నారు.