మన న్యూస్: సాలూరు డిసెంబర్15, పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పండగ శోభని తలపిస్తున్న ఘంటసాల పాటల పండగలో పాలుపంచుకొన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని మంత్రి సంధ్యారాణి అన్నారు. మరుగునపడిన సంగీత పాఠశాలను ప్రభుత్వంతో మాట్లాడి పూర్వవైభవం వచ్చేందుకు కృషి చేస్తాను అనిమంత్రి సంధ్యారాణి అన్నారు, ఆనాడు ఆంగ్లేయులు చేస్తున్న అకృత్యాలను ఘంటసాల పాటలతో తూటాలు వంటి మాటలతో, ప్రజలను చైత్యవంతులను చేసారు,అని మంత్రి సంధ్యారాణి అన్నారు, కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు,నాయకులు పాల్గొన్నారు.