
కలిగిరి, ఏప్రిల్ 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంజా వెంకయ్య అలియాస్ మీసాల అంకయ్య అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, ఇతర టీడీపీ పార్టీ నేతలతో కలిసి అంకయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగడ సానుభూతిని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇస్తూ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి 10000, యూనిట్ ఇంచార్జ్ ఊస మాల్యాద్రి 2000, ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య 2000, కలిగిరి పట్టణ అధ్యక్షులు జిర్ర అంకిరెడ్డి 2000, చొప్పున మొత్తం 16000 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.